Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత కోనసీమ టూర్... 400 ఏళ్ల నాటి అమ్మవారి ఆలయ సందర్శన

  • పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం
  • నేడు ఆలయ పునఃప్రతిష్ఠాపన... హాజరైన కవిత
  • అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం పూర్వజన్మ సుకృతం అని వెల్లడి
Kalvakuntla Kavitha visits 400 years old temple in Konaseema

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలోని కోనసీమ జిల్లాకు విచ్చేశారు. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై కవిత సోషల్ మీడియాలో స్పందించారు. 

ఆలయ పునఃప్రతిష్ఠాపనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని కవిత పేర్కొన్నారు. 

అమ్మవారి దయతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నానని కవిత ట్వీట్ చేశారు. ఈ మేరకు ఫొటోలను కూడా పంచుకున్నారు.

More Telugu News