CNAP: ట్రూకాలర్‌తో ఇక పనిలేనట్టే.. అందుబాటులోకి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్!

  • టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా ప్రతిపాదనలు
  • దేశీయ టెలికం కంపెనీలన్నీ తప్పనిసరిగా అమలు చేయాల్సిందే
  • డిఫాల్ట్‌గా యూజర్లకు అందుబాటులోకి
  • సిమ్ తీసుకున్నప్పుడు రిజిస్టర్ అయిన పేరు ప్రదర్శితం
Trais new rules will mandate telcos to identify callers

ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే, ఇకపై ఆ బాధ తప్పినట్టే. యాప్స్‌తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలుకు నోచుకోనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రెండేళ్ల క్రితం చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ఇప్పుడు దీనిని తప్పనిసరి చేసింది.

వినియోగదారుల అభ్యర్థిన మేరకు సప్లిమెంటరీ సర్వీస్‌గా అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్‌కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థనపై మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

More Telugu News