Janasena Candidates: జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు.. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన పవన్

  • తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ, జనసేన
  • 24 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్
  • అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్, తెనాలి, నెల్లిమర్ల స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
Pawan Kalyan announces 5 MLA candidates names

రానున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తొలి జాబితాను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇరువురు నేతలు కలిసి జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. తొలి జాబితాలో చంద్రబాబు 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను పవన్ తర్వాత ప్రకటించనున్నారు. 

పవన్ ప్రకటించిన ఐదుగురు జనసేన అసెంబ్లీ అభ్యర్థులు:

  • అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
  • రాజానగరం - బలరామకృష్ణుడు
  • కాకినాడ రూరల్ - పంతం నానాజీ
  • తెనాలి - నాదెండ్ల మనోహర్
  • నెల్లిమర్ల - లోకం మాధవి

More Telugu News