TDP Janasena List: తొలి జాబితా... 94 సీట్లు టీడీపీకి, జనసేనకు 24 సీట్లు

  • జనసేనకు 3 పార్లమెంటు సీట్లు
  • వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే లక్ష్యమన్న చంద్రబాబు, పవన్
  • నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని పిలుపు
94 seats for TDP and 24 seats for Janasena

రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ - జనసేన తొలి జాబితాను విడుదల చేశారు. 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ పోటీ చేసే 94 అసెంబ్లీ స్థానాల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. 

ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తక్కువ సీట్లైనా పర్వాలేదనే, అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు. నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో, జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని అన్నారు. జనసేన - టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు.

More Telugu News