Ramana Dikshitulu: రమణ దీక్షితులుపై కేసు నమోదు

  • టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ రమణ దీక్షితులపై కేసు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ ఐటీ విభాగం జీఎం
  • తిరుమల వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు
Police case against Ramana Dikshitulu

తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని రమణ దీక్షితులు అంటున్నారు. 

More Telugu News