Jahnavi Kandula: జాహ్నవి కందుల కేసుపై రివ్యూ కోరిన భారత్

  • సాక్ష్యాల్లేవంటూ పోలీస్ అధికారిని తప్పించడంపై అసంతృప్తి
  • జాహ్నవి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం సంప్రదింపులు
  • సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులతోనూ చర్చలు
Indias Latest Move After US Frees Cop Who Ran Over Andhra Student

జాహ్నవి కందుల మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ ను క్రిమినల్ చర్యల నుంచి తప్పించడంపై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. సియాటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది. కౌంటీ అటార్నీ రివ్యూ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై మరింత లోతుగా విచారించాలంటూ సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్లు రాయబార కార్యాలయం సిబ్బంది తెలిపారు. జాహ్నవి కుటుంబ సభ్యులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ఈమేరకు రాయబార కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలోని సియాటెల్ లో మాస్టర్స్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి కందుల గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోల్ కారు వేగంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. అయితే, ఈ ప్రమాదంలో కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై జాహ్నవి కుటుంబ సభ్యులు, సియాటెల్ లోని జాహ్నవి స్నేహితులతో పాటు భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ తీర్పుపై రివ్యూ కోరింది.

More Telugu News