చంద్రబాబు నివాసానికి బయల్దేరిన పవన్.. కాసేపట్లో ఫస్ట్ లిస్ట్.. తీవ్ర ఉత్కంఠ
- జనసేన కార్యాలయం నుంచి ఉండవల్లికి బయల్దేరిన పవన్
- చంద్రబాబు నివాసం ముందు ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు
- అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్
ఈ సమావేశంలో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో 60 నుంచి 65 మంది అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. కొందరు ఎంపీల పేర్లను కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది. తొలి జాబితా విడుదల అవుతున్న నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న నేతలతో పాటు... ఇరు పార్టీల అభిమానులు, మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.