Farmers: మన దేశంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వివరాలు చూడండి!

  • 2022 అగ్రికల్చర్ మానిటరింగ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
  • 2022లో మన రైతులకు వాటిల్లిన నష్టం 163.6 బిలియన్ అమెరికన్ డాలర్లు
  • చైనాలో  వినియోగదారులకు ప్రభుత్వ పాలసీల మద్దతు మరింత ఘోరం
Who Do Ag Subsidies Support

తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు వేలాది మంది పంజాబ్ రైతులు బయల్దేరారు. వీరందరినీ ఢిల్లీ శివార్లలోనే బ్యారికేడ్లు అడ్డం పెట్టి పోలీసులు నిలువరించారు. ఢిల్లీలోకి దూసుకొస్తున్న వారిపై స్మోక్ బాంబ్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లోక్ సభ ఎన్నికల ముందు రైతులు చేస్తున్న ఈ పోరాటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. రైతులతో కేంద్రం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. 2020, 2021లో కూడా రైతులు ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రైతులు ఇదే స్థాయిలో పోరాటం జరిపారు. గత ఆందోళనల సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు కొంత మేర తలొగ్గింది.  

మరోవైపు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న దేశాలకు సంబంధించి  "ఓఈసీడీ" (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) సంస్థ  2022 అగ్రికల్చరల్ పాలిసీ మానిటరింగ్ రిపోర్ట్ ను విడుదల చేసింది. చాలా దేశాల ప్రభుత్వాలు రైతుల వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడం, పంపిణీ చేయడంలో తమ సామర్థ్యాన్ని చాలా పరిమితంగా వినియోగించుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. ఇండియాలో కూడా రైతులకు సరైన న్యాయం లభించడం లేదని పేర్కొంది. 2020 నుంచి 2022లో అమలు చేసిన పాలసీలు అంతర్జాతీయ మార్కెట్ల కంటే మన దేశ రైతులకు తక్కువ ధర లభించేలా చేశాయని తెలిపింది. భారత వ్యవసాయ పాలసీలు రైతులకు తీవ్ర అన్యాయం చేశాయని పేర్కొంది. 

భారత ప్రభుత్వ పాలసీల ద్వారా 2022లో మన రైతులకు 163.6 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ప్రభుత్వం తరపున రైతులు పొందిన సాయం, డిస్కౌంట్ల తర్వాత కూడా ఇంత మేర రైతులకు నష్టం వాటిల్లింది. మన దేశంలో కష్టపడి పండిస్తున్న రైతులకు లభిస్తున్న మద్దతు  మైనస్ 100.3 బిలియన్ అమెరికన్ డాలర్లు  అంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో వినియోగదారుల మద్దతు  163.6 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ గణాంకాల ప్రకారం రైతన్నల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో వ్యవసాయోత్పత్తుల వినియోగం భారీగా ఉన్నప్పటికీ రైతులకు జీవితాలు మాత్రం మారడం లేదు. ఇదే సమయంలో వ్యవసాయోత్పత్తులను మార్కెట్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు మాత్రం కళ్లు చెదిరే లాభాలతో దూసుకుపోతున్నాయి. 

చైనాలోని రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా  ఉంది. అక్కడ వినియోగదారులకు  మద్దతు ఘోరంగా ఉంది.  కానీ,  రైతులకు ప్రభుత్వ పరంగా మద్దతు 273 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ విషయంలో అమెరికా  రైతులకు అక్కడి ప్రభుత్వం 40.9 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయంతో  అండగా ఉంది.  


కాగా, 2022 సంవత్సరంలో, భారత ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ముఖ్యమైన విధాన మార్పులు చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వరి, మొక్కజొన్న, గోధుమ, పెసలు వంటి ప్రధాన పంటలకు  కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి) పెంచింది. అంతర్జాతీయ ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులకు భారం తగ్గించేందుకు, ఎరువుల శాఖ, దేశీయ ఎరువుల రవాణాకు రాయితీలు ఇవ్వడం సహా ఎరువుల సబ్సిడీలను పెంచింది. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పంటల నిర్వహణకు డ్రోన్లను ఉపయోగించడం, భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి కార్యక్రమాలతో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించింది. 

More Telugu News