Sex Change Surgery: స్నేహితుడిని పెళ్లాడేందుకు లింగమార్పిడి ఆపరేషన్‌తో మహిళగా మారిన యువకుడు.. ఆ తర్వాత జరిగింది ఇదీ..!

Man undergoes sex change surgery to marry his lover later happened this

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో బాధితుడికి, నిందితుడికి కుదిరిన స్నేహం
  • అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానని మాట
  • లక్షలు ఖర్చు చేసి మహిళగా మారాక చేసుకోను పొమ్మన్న నిందితుడు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు (బాధితురాలు)

స్నేహితుడిని పెళ్లాడేందుకు ఓ యువకుడు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా మారిన స్నేహితుడిని తీరా పెళ్లాడేందుకు యువకుడు నిరాకరించడంతో కథ చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన.

ఇండోర్‌కు చెందిన 28 ఏళ్ల బాధితుడికి 2021లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైభవ్ శుక్లాతో సోషల్ మీడియాలో పరిచయమైంది. అది మరింత పెరిగి అది ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమకు దారితీసింది. సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని, అప్పుడు సమాజంలో గౌరవంగా బతకొచ్చని వైభవ్ చెప్పడంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వైభవ్ మాట మార్చాడు. పెళ్లికి నిరాకరించిన శుక్లా.. బాధితుడు (బాధితురాలు)తో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు.

పెళ్లి చేసుకుంటానన్న మిత్రుడు మోసం చేయడంతో మరోదారి లేక బాధితుడు విజయ్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆపరేషన్ కోసం లక్షలు ఖర్చు చేశానని, ఇప్పుడేమో తనను పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాదు, ఈ విషయం ఎవరితోనన్నా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని పేర్కొన్నాడు. నిందితుడిపై సెక్షన్ 377 (అసహజ శృంగారం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్లా కోసం గాలిస్తున్నారు.

Sex Change Surgery
Madhya Pradesh
Indore
Crime News
  • Loading...

More Telugu News