Jaahnavi Kandula: కందుల జాహ్నవి యాక్సిడెంట్ కేసు.. ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష తప్పినట్టేనా?

  • సాక్ష్యాధారాలు లేవంటూ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటన
  • క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదంటున్న నిపుణులు
  • శాఖాపరమైన చర్యలతో సరిపెట్టనున్న సీటెల్ పోలీస్ అధికారులు
  • మండిపడుతున్న జాహ్నవి పేరెంట్స్, భారత విద్యార్థులు
US Cop Who Killed Indian Student Jaahnavi Kandula Let Go Due To Lack Of Evidence

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెట్రోలింగ్ కారుతో వేగంగా ఢీ కొట్టి జాహ్నవి మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ పై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదట. ఈ కేసులో పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని అక్కడి న్యాయస్థానం అభిప్రాయపడింది. బుధవారం వాషింగ్టన్‌ స్టేట్‌లోని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. 

అయితే, డిపార్ట్ మెంట్ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల 4న కెవిన్ డేవ్ పై శాఖాపరమైన విచారణ జరగనుందని, ఆ విచారణకు హాజరై డేవ్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. డేవ్ వివరణతో విచారణ కమిటీ సంతృప్తి చెందనట్లైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై జాహ్నవి కందుల తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని భారత విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. కారుతో ఢీ కొట్టి జాహ్నవి మరణానికి కారణమైన అధికారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. గతేడాది జనవరి 23న సియాటెల్ లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోల్ కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారు నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ కెవన్ డేవ్ కారణమని, 40 కి.మీ. స్పీడ్ తో వెళ్లాల్సిన రోడ్డుపై 100 కి.మీ. స్పీడ్ తో దూసుకెళ్లడమే ప్రమాదానికి దారి తీసిందని విచారణలో తేలింది. స్థానిక మీడియా కూడా ఈమేరకు కథనాలు ప్రసారం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో అధికారి చేసిన వ్యాఖ్యలపైనా దుమారం రేగింది. దీంతో ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ తో పాటు జాహ్నవి మరణంపై చులకన వ్యాఖ్యలు చేసిన మరో అధికారిపైనా చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

More Telugu News