Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతికి రెండు ఉంగరాలు... అసలేంటీ నాగబంధం, కూర్మావతారం?

  • కుడిచేతికి రెండు ఉంగరాలతో దర్శనమిస్తున్న పవన్ 
  • ఒకటి నాగప్రతిమ, రెండోది తాబేలు ప్రతిమతో కూడిన ఉంగరం
  • పవన్ జాతకరీత్యా ఆ ఉంగరాలు చాలా పవర్ ఫుల్ అన్న నిపుణుడు
Pawan Kalyan wears two rings

జనసేనాని పవన్ కల్యాణ్ చేతికి ఈ మధ్య రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. పవన్ తన కుడి చేతి వేళ్లకు ఒకటి తాబేలు ఉంగరం, రెండోది నాగ ప్రతిమ ఉంగరం ధరిస్తున్నారు. పవన్ వేదికపై మాట్లాడే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వీటిపై ఓ జాతక నిపుణుడు వివరణ ఇచ్చారు. 

"పవన్ కల్యాణ్ జాతకం పరంగా చూస్తే... ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. ఆయనది మకర రాశి. మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు. 

చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు, నర ఘోష, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. 

రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఎదుగుదలకు, అధికారానికి, ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష శాస్త్రంలో చెబుతారు" అని వివరించారు.

More Telugu News