Dharmana Prasada Rao: వాలంటీర్లు ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సి వస్తుంది: మంత్రి ధర్మాన

  • శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం
  • కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన 
  • 80 ఏళ్లు దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారని వెల్లడి
  • అందుకే వాలంటీర్లు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని వ్యాఖ్యలు
  • వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కూర్చునేందుకు అడ్డంకులు ఉండబోవని స్పష్టీకరణ
Dharmana says Volunteers would be booth agents in upcoming elections

ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వాలంటీర్ల విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. 

80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నందున ఈ ఎన్నికల్లో వాలంటీర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని అన్నారు. బూత్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని ధర్మాన పేర్కొన్నారు. 

శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో  ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. 

"80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తోంది. తమ పరిధిలోని వృద్ధులతో వాలంటీర్లు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసేలా చూడండి. వాలంటీర్లు చేస్తున్న సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞత చూపకుండా ఎవరూ ఉండరు. ఈ ప్రభుత్వం పడిపోయిన రోజున ఈ రాష్ట్రంలో వేలాది మంది గుండె ఆగిపోయి చనిపోతారు" అని ధర్మాన పేర్కొన్నారు.

More Telugu News