అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా ట్రంప్.. తాజా ర్యాంకింగ్స్ లో వెల్లడి
- ‘ది బెస్ట్ ప్రెసిడెంట్’ లిస్ట్ లో అట్టడుగు స్థానం
- జాబితాలో టాప్ లో అబ్రహాం లింకన్
- ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు 14 వ ర్యాంకు
ఇక ఈ సర్వేలో 95.03 సగటు స్కోరుతో అబ్రహాం లింకన్ మొదటి ర్యాంకును దక్కించుకుని, అమెరికా బెస్ట్ ప్రెసిడెంట్ గా నిలిచాడు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్, జార్జ్ వాషింగ్టన్, టెడ్డీ రూజ్ వెల్ట్, థామస్ జెఫర్సన్, హ్యారీ ట్రూమన్, బరాక్ ఒబామా, డ్వైట్ ఐసెన్ హోవర్ నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ఈ సర్వేలో 14 వ ర్యాంకును దక్కించుకున్నారు. ట్రంప్ పై గెలిచి ప్రెసిడెంట్ పదవిని దక్కించుకోవడం బైడెన్ చేసిన గొప్ప పనుల్లో ఒకటని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారని సర్వే సంస్థ తెలిపింది. ప్రెసిడెంట్ గా బైడెన్ తన నాయకత్వ బాధ్యతలను మరింత సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారని మెచ్చుకున్నారు.