Donald Trump: అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా ట్రంప్.. తాజా ర్యాంకింగ్స్ లో వెల్లడి

  • ‘ది బెస్ట్ ప్రెసిడెంట్’ లిస్ట్ లో అట్టడుగు స్థానం
  • జాబితాలో టాప్ లో అబ్రహాం లింకన్
  • ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు 14 వ ర్యాంకు
Trump Ranked as worst president in US history And Joe Biden ranks 14th Rank

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షుడని తాజా ర్యాంకింగ్ ఒకటి తేల్చింది. మొత్తం 45 మంది ప్రెసిడెంట్లతో బెస్ట్ ప్రెసిడెంట్ ర్యాంకింగ్స్ ఇవ్వగా.. ట్రంప్ అట్టడుగు స్థానం (45వ ర్యాంకు) దక్కించుకున్నారు. సివిల్ వార్ ను ఆపలేకపోవడంతో పాటు తదనంతర పరిణామాలతో ట్రంప్ చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. దీంతో సర్వేలో పాల్గొన్న అమెరికన్లు ట్రంప్ కు చివరి స్థానం కట్టబెట్టారు. ‘2024 ప్రెసిడెన్షియల్ గ్రేట్ నెస్ పాజెక్ట్ ఎక్స్ పర్ట్ సర్వే’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 525 మంది స్కాలర్లు పాల్గొనగా.. సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన 154 విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు పొలిటికల్ సైంటిస్టులు జస్టిన్ వాగన్, బ్రాండన్ రాటింగస్ తెలిపారు.

ఇక ఈ సర్వేలో 95.03 సగటు స్కోరుతో అబ్రహాం లింకన్ మొదటి ర్యాంకును దక్కించుకుని, అమెరికా బెస్ట్ ప్రెసిడెంట్ గా నిలిచాడు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్, జార్జ్ వాషింగ్టన్, టెడ్డీ రూజ్ వెల్ట్, థామస్ జెఫర్సన్, హ్యారీ ట్రూమన్, బరాక్ ఒబామా, డ్వైట్ ఐసెన్ హోవర్ నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ఈ సర్వేలో 14 వ ర్యాంకును దక్కించుకున్నారు. ట్రంప్ పై గెలిచి ప్రెసిడెంట్ పదవిని దక్కించుకోవడం బైడెన్ చేసిన గొప్ప పనుల్లో ఒకటని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారని సర్వే సంస్థ తెలిపింది. ప్రెసిడెంట్ గా బైడెన్ తన నాయకత్వ బాధ్యతలను మరింత సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారని మెచ్చుకున్నారు.

More Telugu News