Nara Lokesh: జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోంది: నారా లోకేశ్

Nara Lokesh condemns attack on Eenadu media office in Kurnool
  • కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి 
  • ఎమ్మెల్యే కాటసాని రౌడీమూకల్ని వదిలారన్న లోకేశ్ 
  • వైసీపీ దాడులు అటవిక పాలనకు పరాకాష్ఠ అని విమర్శలు
కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. దీనిపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోందని అన్నారు. 

అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ను అంతం చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇవాళ కర్నూలు ఈనాడు కార్యాలయం పైకి ఎమ్మెల్యే కాటసాని రౌడీమూకల్ని వదిలారని ఆరోపించారు. ఈనాడు పత్రికా కార్యాలయంపై వైసీపీ దాడులు అటవిక పాలనకు పరాకాష్ఠ అని విమర్శించారు. మీడియాపై సైకో జగన్ ఫ్యాక్షన్ దాడులను ఖండిస్తున్నానని తెలిపారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని తీవ్రస్థాయిలో స్పందించారు. విలేకరులపైనా, మీడియా సంస్థలపైనా దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారని తెలిపారు. పత్రికా కార్యాలయంపైనే దాడి జరిగితే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని అన్నారు.
Nara Lokesh
Eenadu
Kurnool
TDP
YSRCP

More Telugu News