Akaay: మరోసారి తండ్రయిన కోహ్లీ... పండంటి మగబిడ్డకు జన్మనచ్చిన అనుష్క శర్మ

  • ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మననిచ్చిన అనుష్క శర్మ
  • సంయుక్తంగా ప్రకటన చేసిన కోహ్లీ-అనుష్క
  • బిడ్డకు అకాయ్ అని నామకరణం
Kohli and Ansuhka Sharma blessed with baby boy this time

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కోహ్లీ, అనుష్క సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు. 'మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

కాగా, తమ బిడ్డకు అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు.

More Telugu News