Ayyanna Patrudu: మంత్రి రోజా కబడ్డీ ఆడడంపై అయ్యన్న సెటైర్లు

  • ఏపీలో ఇటీవల ఆడుదాం ఆంధ్రా నిర్వహించిన ప్రభుత్వం
  • కబడ్డీ ఆడిన మంత్రి రోజా
  • జగన్ జైలుకు పోవడానికి సిద్ధం అని చెబుతున్నాడన్న అయ్యన్న 
Ayyanna satires on minister Roja playing Kabaddi

ఏపీలో ఇటీవల ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహించగా... సీఎం జగన్, మంత్రి రోజా పలు సందర్భాల్లో క్రికెట్ ఆడారు. రోజా కబడ్డీ కూడా ఆడారు. దీనిపై నర్సీపట్నం శంఖారావం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

"ఆడుకుందాం రా... అంటాడు. రోజా ఒక బ్యాటు... ఈడొక బ్యాటు... తెగ ఆడేత్తన్నారండీ! మొన్న చూశాను... రోజా కబడ్డీ ఆడుతోంది... నేను టీవీలో చూశాను... ఎవరబ్బా అని చూస్తే... రోజా! ఎలాగ ఆడుతోందో తెలుసా?...  రూ.800 కోట్లు ఖర్చట. మనకు ఇవ్వడానికి డబ్బుల్లేవు. ఈడు మాత్రం రూ.800 కోట్లతో బ్యాటు ఆట ఆడతాడట! 

ఈ మధ్య పోస్టర్లు చూశారా... సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే ఏదో అనుకునేరు... నేను జైలుకు పోవడానికి సిద్ధం అని చెబుతున్నాడు. సిద్ధం అంటే అదీ! అది ప్రచారం చేసుకోవడానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆరు కిలోమీటర్లు వెళ్లాలంటే హెలికాప్టర్ కావాలి. జనాల్లోకి వెళ్లలేడు. ఇటువంటి సైకోలను, రాక్షసులను రాజకీయ సమాధి చేయాలి" అంటూ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.

More Telugu News