HCA: హైదరాబాద్ రంజీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్

  • రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ జట్టు
  • ఎలైట్ గ్రూప్ పోటీలకు అర్హత
  • ఎలైట్ టైటిల్ సాధిస్తే బీఎండబ్ల్యూ కారు, రూ.1 కోటి నగదు ఇస్తామని ప్రకటన
HCA President announces bumper offer for Hyderabad Ranji players

కారణాలు ఏవైతేనేమి... గత కొన్నాళ్లుగా  హైదరాబాద్ రంజీ జట్టు పతనం దిశగా పయనించింది. అయితే తాజా సీజన్ లో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఈ సీజన్ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ జట్టు మేఘాలయపై 5 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. అంతేకాదు, రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. 

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరిశనపల్లి హైదరాబాద్ రంజీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ టైటిల్ విజేతగా నిలిస్తే... ప్రతి ఒక్క ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు, రూ.1 కోటి నగదు నజరానా అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.

More Telugu News