Rohit Sharma: నాలుగో టెస్టులో రోహిత్ ఆ ఐదు రికార్డులు కొడతాడా?

  • మరో 23 రన్స్ చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగులు
  • మరో 70 రన్స్ కొడితే ఇగ్లాండ్ పై వెయ్యి పరుగుల పూర్తి
  • మరో 7 సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన ఘనత
5 records for Rohit Sharma in 4 test against England

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో రోహిత్ కు రికార్డులు ఉన్నాయి. టెస్టుల్లో రికార్డులు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ... ఓపెనర్ గా వస్తున్న తర్వాత రోహిత్ ఆట మరో లెవెల్లో ఉంటోంది. వరుసగా ఏదో ఒక రికార్డు సాధిస్తున్నాడు. 

రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు జరగబోతోంది. ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-1 లీడ్ లో ఉంది. నాలుగో టెస్టులో రోహిత్ ను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏమిటో చూద్దాం. 

టెస్టుల్లో రోహిత్ ఇప్పటి వరకు 3,977 పరుగులు చేశాడు. మరో 23 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటుతాడు. టెస్టుల్లో కెప్టెన్ గా వెయ్యి పరుగుల మార్క్ ను చేరుకోవడానికి 70 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 13 పరుగుల దూరంలో నిలిచాడు. మరో 7 సిక్సులు బాదితే.... ఇంటర్నేషనల్ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన ఘనతను సాధిస్తాడు. మరో 37 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 9 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.  

More Telugu News