Nara Lokesh: ముసలోడు ఎవరో ఈ రోజుతో తేలిపోవాలి: నారా లోకేశ్

Nara Lokes challenges CM Jagan
  • జగన్ ప్రతి మీటింగులో చంద్రబాబును ముసలోడు అంటున్నారన్న లోకేశ్
  • తండ్రి వయసున్న చంద్రబాబును ముసలోడు అంటున్నారని ఫైర్
  • ఇద్దరూ కలిసి తిరుపతి కొండ ఎక్కాలన్న లోకేశ్
  • ఎవరు కుర్రాడో, ఎవరు ముసలోడో తేలిపోతుందని వ్యాఖ్యలు
జగన్ ప్రతి మీటింగులో తన తండ్రి వయసున్న చంద్రబాబును ముసలోడు, ముసలోడు అంటున్నాడని నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలని అన్నారు. 

"జగన్ బస్సు దిగాలంటే స్టూలు వేయాలి. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయిని ఎత్తిపట్టుకోవాలి... ఆ రాయిని ఎత్తిపట్టుకుంటే జగన్ నడుం వంగకుండా కొబ్బరికాయ కొడతాడు. ఈ జగన్ బైకు నడపాలంటే ఇటు నలుగురు, అటు నలుగురు పట్టుకోవాలి. గత ఐదేళ్ల నుంచి చూస్తే పట్టుమని గంట పాటు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. సాయంత్రం 6 అయితే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి పడుకుంటాడు. 

మై డియర్ జగన్... డేట్, టైమ్ నువ్వు ఫిక్స్ చేయ్... తిరుపతి కొండనో, పక్కనే ఉన్న రామతీర్థం కొండనో చంద్రబాబు, మీరు కలిసి ఎక్కండి... ఎవరు ముందు ఎక్కుతారో, ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. ఎవరు కుర్రాడో, ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్" అంటూ నారా లోకేశ్ ప్రసంగించారు. 

మాడుగుల నియోజకవర్గంలో శంఖారావం సభ సందర్భంగా నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నారు.
Nara Lokesh
Chandrababu
Jagan
TDP
YSRCP
Shankaravam

More Telugu News