Bandi Sanjay: బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు అనే వారిని చెప్పుతో కొట్టండి: బండి సంజయ్

  • తాండూరులో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
  • కేసీఆర్ అవినీతికి పాల్పడినా ఎందుకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ కు ప్రశ్న
  • కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపణ
Bandi Sanjay comments on Congress and BRS

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు అనే వారిని చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బీఎల్ వర్మతో కలిసి ఈరోజు తాండూరులో విజయ సంకల్ప యాత్రను సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలిసినా... ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రధాని మోదీకి 370 పార్లమెంటు స్థానాలను గిఫ్ట్ గా ఇద్దామని పిలుపునిచ్చారు. హిందుత్వ కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని.... హిందుత్వం గురించి మాట్లాలేని రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

More Telugu News