Ranbir Kapoor: ఓటీటీ సెంటర్స్ లో ఈ మూడు సినిమాలదే హవా!

  • నెట్ ఫ్లిక్స్ లో 'యానిమల్' జోరు 
  • హాట్ స్టార్ లో సందడి చేస్తున్న 'సలార్'
  • కొనసాగుతున్న 'గుంటూరు కారం' హవా

OTT top three movies

ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు వెంటవెంటనే ఓటీటీ సెంటర్స్ లోకి అడుగుపెట్టేశాయి. అలా వచ్చిన సినిమాలలో మూడు సినిమాలు టాప్ త్రీ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. ఆ జాబితాలో మొదటి స్థానంలో 'యానిమల్' కనిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో స్థానంలో ప్రభాస్ కథానాయకుడిగా చేసిన 'సలార్' నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 800 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమా, జనవరి 12వ తేదీ నుంచి హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంది. ఇక మూడో స్థానంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' కనిపిస్తుంది. శ్రీలీల కథానాయికగా అలరించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లనే రాబట్టింది. ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తరువాత నార్త్ నుంచి .. సౌత్ నుంచి చాలా సినిమాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ  మూడు సినిమాల జోరు కొనసాగుతోంది. 

More Telugu News