Stock Market: 73 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్

  • 349 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 75 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
Sensex crosses 73k mark

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య ప్రారంభమైన మార్కెట్లు... ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠ స్థాయులను తాకాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 73,130.69 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 73,057 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 22,197 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 82.96గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.16%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.59%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), ఎన్టీపీసీ (2.01%), కోటక్ బ్యాంక్ (1.83%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.03%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.96%), ఇన్ఫోసిస్ (-0.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.86%).

More Telugu News