ISRO: ఇస్రో మరో ప్రయోగం.. అరుణగ్రహంపైకి డ్రోన్!

  • మార్స్ వాతావరణంపై ప్రయోగాలకు రోటోక్రాఫ్ట్‌ను పంపే యోచన
  • ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే
  • పలు సెన్సార్లతో వెళ్లి అంగారక వాతావరణంపై పరిశోధనలు
ISRo Plans To Send Rotocopter To Mars

అంగారకుడిపై ప్రయోగాల కోసం ‘మంగళయాన్’ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు 2022తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగరాకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది. 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌జెన్యుటీ క్వాడ్ కాప్టర్ ఇటీవలే విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోటోక్రాఫ్ట్‌ను పంపాలని ఇస్రో నిర్ణయించింది. అయితే, ఇది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఇది ఉష్ణోగ్రత, తేమ, ఒత్తిడి, గాలి వేగం, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ట్రేస్ స్పీసెస్, డస్ట్ సెన్సార్లను మోసుకెళ్తుంది. మార్స్ వాతావరణంపై ప్రయోగాలు చేసే ఈ డ్రోన్ అంగారక ఉపరితలానికి 100 మీటర్లపైన చక్కర్లు కొడుతుంది.

More Telugu News