Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపులు... నిందితుడి అరెస్ట్

  • విమానాల్లో హైజాకర్లు ఉన్నారంటూ ఈ-మెయిల్స్
  • బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీని నిందితుడిగా గుర్తించిన పోలీసులు
  • ఉద్యోగం పోయిందన్న డిప్రెషన్ లో ఈ-మెయిల్స్ పంపాడని వెల్లడి
Police arrest Bengaluru man who sent fake threat emails to Shamshabad airpirt

నకిలీ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు వైభవ్ తివారీ. బెంగళూరుకు చెందిన తివారీ విమానాల్లో హైజాకర్లు ఉన్నారంటూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపాడు. రెండు పర్యాయాలు అతడు ఇలాగే మెయిల్స్ చేశాడు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా, ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదు. దాంతో ఆ బెదిరింపులు ఉత్తుత్తివని తేలింది. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీయే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడ్డాడని గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగం నుంచి తీసేయడంతో, డిప్రెషన్ కు లోనైన తివారీ ఈ విధంగా నకిలీ బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్టు పోలీసులు వెల్లడించారు.

More Telugu News