Nara Lokesh: జగన్ రాత్రి మాట్లాడాల్సిన స్క్రిప్టును పగలు మాట్లాడాడు: నారా లోకేశ్ సెటైర్లు

  • ఉత్తరాంధ్రలో లోకేశ్ శంఖారావం యాత్ర
  • చోడవరం సభకు హాజరు
  • ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయిందన్న లోకేశ్
  • రాప్తాడులో జగన్ వందసార్లు చంద్రబాబు జపం చేశాడని వెల్లడి
  • జగన్ కు సైకిలు, గాజు గ్లాసు విలువ తెలియదని విమర్శలు
Lokesh satires on CM Jagan Raptadu Siddham meeting

ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చోడవరంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఉత్తరాంధ్రలో 9 రోజులుగా తిరుగుతున్నానని, తనకు ఇది నా 28వ సభ అని వెల్లడించారు. నాకు ఇప్పుడు ఒకటే అర్ధమైంది... ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశారు. గత 4 ఏళ్ల 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజలతో జగన్ ఆడుకున్నారు... అదే ఉత్తరాంధ్ర ప్రజలు రెండు నెలల్లో జగన్ ను ఆడుకోబోతున్నారని స్పష్టం చేశారు. 

జగన్ వందసార్లు చంద్రబాబు జపం చేశాడు

సిద్ధం అని జగన్ పదే పదే అంటున్నారు. సిద్ధం అంటూ గంతులేసుకుంటూ రాప్తాడు వెళ్లాడు. కానీ ఆ సభలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా లేమని చెప్పారు. అక్కడ ఖాళీ కుర్చీలు ఫోటో తీసిన విలేకరిని చితకబాదారు. సీఎం హోదాలో మాట్లాడుతుంటే ఎవరన్నా చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ పొడిచింది ఏమీ లేక జగన్ వందసార్లు చంద్రబాబు జపం చేశాడు. జగన్ కి కలలో కూడా చంద్రబాబు వస్తారేమో! 

వింత అంటే ఇదే!

సభలో ఓ వింత జరిగింది. సభ మంచి ఎండలో జరిగింది. అక్కడి వైసీపీ కార్యకర్తలను జగన్ ఫోన్ తీసి టార్చ్ లైట్ వేయండని చెప్పారు. వారికి కూడా అర్థం కాలేదు... ఒకడి మొహం ఒకడు చూసుకున్నారు. అప్పుడు వాళ్లు జగన్ కు రేచీకటి ఉందా లేక చిప్ దొబ్బిందా అని అనుకున్నారు. రాత్రి మాట్లాడాల్సిన స్క్రిప్ట్ పగలు మాట్లాడాడు. ఏం హామీలిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియని వ్యక్తి సైకో.

అందుకే జగన్ కు వాటి విలువ తెలియదు

ఆ సభలో కొన్ని డైలాగులు వేశాడు. సైకిల్, గాజుగ్లాసు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ అత్యంత ధనవంతుడు. అందుకే సైకిల్, గాజు గ్లాస్ విలువ తెలియదు. సైకిల్ పేదవాడికి చైతన్య రథం. గాజుగ్లాసులో మనం టీ తాగుతాం... కడుక్కుని దాచుకుంటాం. జగన్ వెండి గ్లాసులో టీ తాగుతాడునుకుంటా అందుకే వాటి విలువ తెలియదు.  

రెక్కలు విరిగిన ఫ్యాన్ ను మనం చెత్తబుట్టలో వేస్తాం. ఈ 4 ఏళ్ల 10 నెలలు ఫ్యాన్ దేనికి పనికొచ్చింది? రైతుల ఆత్మహత్యలకు మాత్రమే పనికొచ్చింది. నిరుద్యోగుల ఆత్మహత్యకు పనికొచ్చింది ఆ ఫ్యాన్. తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు పెట్టి చదివించారు... అయినా ఉద్యోగాలు లేక ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోతున్నారు. 

భవన నిర్మాణ కార్మికులు కూడా ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోతున్న పరిస్థితి. గత 4 ఏళ్ల 10 నెలలుగా 35 వేలమంది ఈ ప్రభుత్వ వేధింపులతో ఫ్యాన్ కు  ఉరేసుకున్నారు. చోడవరం ప్రజలకే కాదు... 5 కోట్ల ఆంధ్రులకు పిలుపునిస్తున్నా... ఎన్నికలకు ఇక 2 నెలలే ఉంది... ఆ ఫ్యాన్ ను పీకి చెత్తబుట్టలో వేయాలి. 

నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
20-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలు

మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
(మాడుగల ఘాట్ రోడ్ జంక్షన్, వడ్డాడి-పాడేరు రోడ్)
ఉదయం
10.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్ ప్రసంగం.
10.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32 – మాడుగుల జనసేన సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ ప్రసంగం.
10.34– మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పీవీజీ కుమార్ ప్రసంగం.
10.36– మాడుగుల నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
1.30 – నర్సీపట్నం నియోజకవర్గంలో భోజన విరామం.

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
(బలిగట్టం గ్రామం, నర్సీపట్నం మున్సిపాలిటీ)
మధ్యాహ్నం
2.30 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్ ప్రసంగం.
2.35 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేశ్ బాబు ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆర్. సూర్యచంద్ర ప్రసంగం. 
3.04 – నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగం.
3.06– నర్సీపట్నం నియోజకవర్గ సభలో లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.00 – పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేశ్ చేరిక.

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం
(కోటవైరట్ల మండలం, కోటవైరట్ల పోలీస్ స్టేషన్ దగ్గర)
సాయంత్రం
5.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్ ప్రసంగం.
5.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.32 – పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి ప్రసంగం.
5.34 – పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ వంగలపూడి అనిత ప్రసంగం.
5.36 – పాయకరావుపేట నియోజకవర్గ శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టీడీపీ కార్యకర్తలచే యువనేత లోకేశ్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్ట్ కు ప్రయాణం
8.30 – విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు పయనం

More Telugu News