K Kavitha: తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kavitha asks for employement security for women
  • నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకువచ్చిన జీవో నెంబర్ 3ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • ఇందిరమ్మ రాజ్యం తీసుకు వస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శ
  • ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపాటు
తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని, నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకువచ్చిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు తెలిపారు.

సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యం తీసుకు వస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు.
K Kavitha
BRS
Congress
Revanth Reddy

More Telugu News