గిరిజన గూడెంలో 'సుందరం మాస్టర్'గారి కామెడీ
- వైవా హర్ష హీరోగా 'సుందరం మాస్టర్'
- కామెడీ టచ్ తో కూడిన కంటెంట్
- ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
- ఈ నెల 23వ తేదీన ఈ సినిమా రిలీజ్
ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం ప్లస్ అయింది. ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక అడవిలోని గిరిజన గూడెం ప్రజలకు ఆంగ్లాన్ని బోధించమని హీరోను పంపిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత, తనకంటే వాళ్లకే ఇంగ్లిష్ బాగా వచ్చనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే కామెడీని వర్కౌట్ చేశారు.
గిరిజనులకు ఇంగ్లిష్ వచ్చు .. అయినా తనని అక్కడికి ఎందుకు పంపించారనేది అతనికి అర్థం కాదు. ఆ అడవిలో తనకి అర్థం కాని రహస్యమేదో ఉందనీ, తన ద్వారా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడతను ఏం చేస్తాడనేదే కథ. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.