Akhanda 2: బోయపాటి స్క్రిప్ట్ రెడీ .. ఇక బాలయ్యదే ఆలస్యం!

  • బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేకం 'అఖండ'
  • సీక్వెల్  కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • సంక్రాంతి బరిలోకి దిగే ఛాన్స్ 

Akhanda 2 Movie Update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. బాలకృష్ణ లుక్ .. ఆయన డైలాగ్స్ .. పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. యాక్షన్ సినిమాకి డివోషనల్ టచ్ ఇవ్వడంతో, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. 

అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. బోయపాటి ఈ సినిమాకి సంబంధించిన స్కిప్ట్ ను రెడీ చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎం.రత్నం ఈ సినిమా డైలాగ్ వెర్షన్ ను పూర్తి చేయడం జరిగిందని అంటున్నారు. మిగతా పనులను చక్కబెట్టే పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. 

ప్రస్తుతం బాబీ సినిమాకి సంబంధించిన షూటింగులో బాలయ్య ఉన్నారు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 109వ సినిమా. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే ఆయన బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళతారని అంటున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా విజువల్ వండర్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

More Telugu News