Mustafizur Rahman: నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డ బంగ్లాదేశ్ స్టార్ బౌలర్!

Bangladesh star bowler injured during practise net session
  • బంగ్లాదేశ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఘటన
  • కొమిల్లా విక్టోరియన్స్‌ జట్టు సభ్యుడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ తలకు బంతి తగలి రక్తస్రావం
  • తల అంతర్గతంగా బ్లీడింగ్ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్న వైనం
నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. బంతి తలకు తగిలి రక్తస్రావం కావడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రెహ్మాన్.. సోమవారం సిల్హెట్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌ల ఆడాల్సి ఉంది. ఇంతలో గాయం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. 

చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఈ ఘటన జరిగింది. కొమిల్లా జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి..బౌలింగ్ ఎండ్ వైపు వెళుతున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తలిగింది. అక్కడున్న ఫిజీషియన్లు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత స్థానికంగా ఉన్న ఇంపీరియల్ ఆసుపత్రికి తరలించారు. 

అయితే, తల పైభాగంలోనే గాయం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల అంతర్గతంగా బ్లీడింగ్ ఏమీ లేదని తేలింది. గాయానికి కొన్ని కుట్లు వేశారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడని కొమిల్లా విక్టోరియన్స్ టీం ఫిజియో జహీదుల్ ఇస్లాం అప్‌డేట్ ఇచ్చాడు.
Mustafizur Rahman
Bangladesh
Cricket

More Telugu News