Tarak Ratna: తారకరత్న మమ్మల్ని వదిలి వెళ్లి ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాం: చంద్రబాబు, లోకేశ్

Chandrababu and Nara Lokesh remembers Tarak Ratna on his first death anniversary
  • గతేడాది గుండెపోటుతో మరణించిన తారకరత్న
  • నేడు ప్రథమ వర్ధంతి
  • విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, నారా లోకేశ్
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

ఇవాళ తారకరత్న ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ స్పందించారు. తారకరత్న తమను వదిలి వెళ్లి ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. 

"ప్రథమ వర్థంతి వేళ తారకరత్నను స్మరించుకుంటున్నాం. చాలా చిన్న వయసులోనే మాకు దూరమయ్యాడు. తారకరత్న వదిలి వెళ్లిన జ్ఞాపకాలే మాకు ఓదార్పు. ఆ జ్ఞాపకాలను మేం పదిలంగా దాచుకుంటాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

"తారకరత్న మమ్మల్ని వదిలి వెళ్లి అప్పుడే ఏడాది అయిందా? నీవు వదిలి వెళ్లిన మధురమైన జ్ఞాపకాలు నిన్ను మా మనసుల్లో సజీవంగా ఉంచుతున్నాయి. ప్రియమైన సోదరుడా... నిన్ను మేం ఎంతగానో మిస్సవుతున్నాం" అంటూ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
Tarak Ratna
Chandrababu
Nara Lokesh
TDP

More Telugu News