పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. ఇన్ స్టాలో సింగర్ పోస్టు వైరల్
- ఈ నెల 10న బాబు పుట్టినట్లు తాజాగా కన్ఫాం చేసిన గీతామాధురి
- 2014 లో గీతామాధురి, నందుల ప్రేమ వివాహం
- 2019లో పాపకు జన్మనిచ్చిన సింగర్
కొంతకాలంగా గీతామాధురి పాటలకు దూరమైంది. ఈ విషయంపై యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరగడంతో కిందటి నెల గీతామాధురి వివరణ ఇచ్చింది. దాక్షాయణి ప్రకృతి (తన కూతురు) అక్క కాబోతోందంటూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల జరిగిన తన సీమంతం ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తాజాగా తనకు కొడుకు పుట్టినట్లు పోస్ట్ చేసింది. నందు, గీతామాధురి ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. 2019లో ఈ దంపతులకు పాప పుట్టింది. పాపకు దాక్షాయణి ప్రకృతి అంటూ నామకరణం చేశారు.