Pushpa: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన 'పుష్ప' షో రీల్ ఇదే!

  • బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పుష్ప
  • బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అల్లు అర్జున్ కు ప్రత్యేక ఆహ్వానం
  • ఆకట్టుకుంటున్న స్పెషల్ కట్ వీడియో
Pushpa Show reel specially screened at Berlin Film Festival

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపును అందించిన చిత్రం పుష్ప: ది రైజ్. ఇప్పుడీ సినిమా ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా వెళ్లింది. అంతేకాదు, పుష్ప క్రేజ్ తో అల్లు అర్జున్ కు బెర్లిన్ చలనచిత్రోత్సవ నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ప్రస్తుతం బన్నీ బెర్లిన్ లో బిజీగా ఉన్నారు. 

కాగా, ఈ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప చిత్రం షో రీల్ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లిషు సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ రీల్ చివర్లో పుష్ప-2: ద రూల్ చిత్రం సీన్లను కూడా జోడించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ షో రీల్ బన్నీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

More Telugu News