Telangana: అన్నారం బ్యారేజీ వద్ద లీకేజీ... నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు... ఇదిగో వీడియో

  • ఈ బ్యారేజీలో గతంలోనూ రెండు పియర్ల వద్ద లీకేజీ
  • అప్పుడు చర్యలు చేపట్టిన అధికారులు
  • ఇప్పుడు మరోసారి అదే సమస్య
Seepage at Annaram Barrage second time

అన్నారం బ్యారేజీ వద్ద అధికారులు మరోసారి లీకేజీని గుర్తించారు. దీంతో ఇక్కడ నీటిని దిగువకు విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం (సరస్వతి) బ్యారేజీని నిర్మించారు. ఈ బ్యారేజీలో గతంలో రెండు పియర్ల వద్ద లీకేజీ కనిపించింది. నీరు బుంగలు బుంగలుగా బయటకు వచ్చింది. అప్పుడు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు.

ఇప్పుడు మరోసారి అదే సమస్య తలెత్తింది. దీంతో బ్యారేజీ వద్ద నీటిని వెలుపలకు విడుదల చేస్తున్నారు. ఇందులోని రెండు టీఎంసీల నీటిని పది గేట్లు ఎత్తి బయటకు వదులుతున్నారు. 13వ గేటు నుంచి 22వ గేటు వరకు ఎత్తారు. తాజా లీకేజీకి మరోసారి మరమ్మతులు చేసేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు.

ఈ లీకేజీకి సంబంధించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్వీట్ చేసింది. "కాళేశ్వరం కరప్షన్ రావు" -కట్టిన పేకమేడ ప్రాజెక్ట్... అన్నారం బ్యారేజీ యొక్క వెంట్ 35 DS వద్ద లీకేజీ అని ట్వీట్ చేసింది. లీకేజీకి సంబంధించి 30 సెకండ్ల వీడియోను షేర్ చేసింది.

More Telugu News