Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ పార్టీలో అల్లు అర్జున్ హవా మామూలుగా లేదు... ఫొటోలు ఇవిగో!

Allu Arjun garnered huge attention at Berlin Film Festival
  • జర్మనీలో ప్రతిష్ఠాత్మకంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లిన అల్లు అర్జున్
  • ఈవెనింగ్ పార్టీలో తళుక్కుమన్న బన్నీ
జర్మనీలోని బెర్లిన్ నగరంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశిష్ట ఆహ్వానితుడిగా వెళ్లారు. 74వ బెర్లిన్ చలనచిత్ర ఉత్సవానికి అంతర్జాతీయ స్థాయి దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, సినీ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు విచ్చేశారు. ఇంతమంది ప్రముఖుల మధ్య అల్లు అర్జున్ కు, పుష్ప టీమ్ కు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన సాయంకాలం విందు కార్యక్రంలో అల్లు అర్జున్ తళుక్కుమన్నారు. గ్లోబల్ మీడియా, అంతర్జాతీయ సినీ విమర్శకులు అల్లు అర్జున్ తో ముచ్చటించేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ప్రఖ్యాత బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ అల్లు అర్జున్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంది. 

ఈ మేరకు ఫొటోలను సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బన్నీ అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Allu Arjun
Berlin Film Festival
Germany
Pushpa
Icon Star
Tollywood

More Telugu News