INSAT-3DS: ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

  • శ్రీహరికోట నుంచి ఇన్ శాట్-3డీఎస్ ప్రయోగం
  • ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్
  • అన్ని దశలు విజయవంతం
  • నిర్దేశిత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం
  • శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించిన ఇస్రో చైర్మన్
INSAT 3DS Satellite successfully enters orbit

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సాయంత్రం 6.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది. తొలి రెండు దశలు విజయవంతం అయ్యాక, క్రయోజనిక్ దశ కూడా సాఫీగా సాగింది. ఈ క్రమంలో పలు విన్యాసాల ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చారు. 

ప్రయోగంలో అన్ని దశలు సజావుగా పూర్తి కావడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఓ ప్రకటన చేశారు. ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. పే లోడ్ లు తయారుచేసిన శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు అంటూ వెల్లడించారు. ఉపగ్రహం తయారీకి ఎంతో కష్టపడ్డామని సోమనాథ్ తెలిపారు.

భూ, సముద్ర ఉపరితల వాతావరణంపై పరిశీలన కోసం ఈ ఉపగ్రహం సేవలను వినియోగించుకోనున్నారు. ఇన్ శాట్-3డీఎస్ విపత్తులపై ముందే హెచ్చరికలు చేస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 2,275 కిలోలు.

More Telugu News