Vinod Kumar: తెలుగులో గ్యాప్ రావడానికి అదే కారణం: సీనియర్ హీరో వినోద్ కుమార్

  • 90లలో హీరోగా దూసుకెళ్లిన వినోద్ కుమార్ 
  • పాత్ర నచ్చితే చేసేసే వాడినని వెల్లడి    
  • బిజినెస్ పై దృష్టిపెట్టడం వల్ల్లె సినిమాలు తగ్గించానన్న వినోద్ 
Vinod Kumar Interview

వినోద్ కుమార్ 1990లలో హీరోగా ఒక వెలుగు వెలిగారు. కన్నడ సినిమాల నుంచి వచ్చిన ఆయన, చాలా వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మంచి హైటూ .. పర్సనాలిటీతో ఆకట్టుకున్నారు. 1990 నుంచి 97వరకూ తెలుగులో అత్యధిక సినిమాలు చేశారు. అలాంటి వినోద్ కుమార్ కి, 2016 నుంచి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

"నేను హీరోను అవుతాననిగానీ .. అవ్వాలనిగాని ఎప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండానే జరిగిపోయింది. అలాగే ఫలానా బ్యానర్లో అయితేనే .. ఫలానా కాంబినేషన్ అయితేనే చేయాలనే ఆలోచన కూడా అప్పట్లో ఉండేది కాదు. పాత్ర నచ్చితే చేసేవాడిని .. ఇతర విషయాలను గురించిన ఆలోచన చేసేవాడిని కాదు" అని అన్నారు. 

"మౌనపోరాటం .. మామగారు .. సీతారత్నంగారి అబ్బాయి వంటి భారీ సక్సెస్ లు నా కెరియర్లో ఉన్నాయి. ఒకానొక సమయంలో నేను చేసిన సినిమాలు వెంటవెంటనే థియేటర్లకు వచ్చాయి. ఆ తరువాత నేను బిజినెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం వలన, సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అంతకు మించి మరేం లేదు. 'రాజధాని ఫైల్స్' మాదిరిగా పాత్ర నచ్చితే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను" అని చెప్పారు.

More Telugu News