Nagababu: నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు: నాగబాబు

Nagababu says he never told that he does not contest in upcoming elections
  • అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇల్లు తీసుకున్న నాగబాబు
  • అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం
  • 2019లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నాగబాబు
మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా, లేక పోటీకి దూరంగా ఉంటారా అనే అంశంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుంది అని వివరించారు. 

కాగా, నాగబాబు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇల్లు తీసుకోవడంతో ఆయన ఎంపీగా పోటీ చేసేది అనకాపల్లి స్థానం నుంచే అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనకాపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహించారు. 

టీడీపీతో పొత్తు నేపథ్యంలో, తమ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో అధిక స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Nagababu
Elections
MP
Anakapalli
Janasena
TDP
Pawan Kalyan
Chandrababu
Andhra Pradesh

More Telugu News