Nagababu: నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మ్యాటర్: నాగబాబు

Dont laugh its a serious matter says Nagababu
  • సీఎం జగన్ పై నాగబాబు విమర్శలు
  • లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు అని ఎద్దేవా
  • పేదోడికి, పెత్తందార్లకి మధ్య యుద్ధం అంటుంటే నవ్వాగట్లేదని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత నాగబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'అనగనగా ఒక పేదవాడు. పదుల సంఖ్యలో ప్యాలెస్ లు, వేల కోట్ల బ్యాలెన్సు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు... నవ్వకండి. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్' అని ఆయన అన్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్న మీరు 'పేదోడికి, పెత్తందార్లకి మధ్య యుద్ధం' అంటుంటే నవ్వాగట్లేదు సారూ అని ఎద్దేవా చేశారు. బహుశా ఇది నిజమేనేమో సుమండి... పెత్తందార్లైన మీకు, పేదోడికి మధ్య నిజంగానే యుద్ధం... అందుకే మీరు రాష్ట్రమంతా 'సిద్ధం' బ్యానర్లతో సిద్ధమయ్యారని అనిపిస్తోందని అన్నారు. 

వైసీపీ ఎంపీల ఆస్తులు రూ. 4,766 కోట్లు, వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు అని నాగబాబు తెలిపారు. దేశంలో 3వ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీవారేనని చెప్పారు.
Nagababu
Janasena
Jagan
YSRCP
AP Politics

More Telugu News