Rajkot Test: రాజ్‌కోట్ టెస్ట్: సిరాజ్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. చివరి ఐదు వికెట్లలో నాలుగు సిరాజ్‌వే

  • తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • భారత్‌కు 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
  • కుల్దీప్ యాదవ్, జడేజాకు చెరో రెండు వికెట్లు
Rajkot Test England Ends First Innings At 319 Runs Siraj Smiles

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. మూడోరోజు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆ తర్వాత మరో 29 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను చేజార్చుకుని 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయడంతో 126 పరుగుల ఆధిక్యం లభించింది.

భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. చివరి ఐదు వికెట్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 153 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా ఒల్లీ పోప్ 39, కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేదు.

More Telugu News