ట్రంప్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బ్యాంకులను మోసంచేసిన కేసులో రూ. 3 వేల కోట్ల జరిమానా
- ట్రంప్‌పై కేసు వేసిన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియో జేమ్స్
- ఆరోపణలు నిజమని తేలడంతో జరిమానా విధించిన న్యూయార్క్ కోర్టు
- సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష విధించడం లేదన్న కోర్టు
ఈ ఆరోపణలు నిజమని తేలడంతో న్యాయమూర్తి ఆయనకు 365 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతోపాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన మూడేళ్లపాటు డైరెక్టర్‌గా కానీ, అధికారిగా కానీ ఉండకూడదని న్యాయస్థానం నిన్న తీర్పు వెలువరించింది. అయితే, ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష విధించలేదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ట్రంప్ తరపు న్యాయవాదులు తెలిపారు. కాగా, ట్రంప్ ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.