High Court: పోలీసులు ఉన్నదే ప్రజల కోసం... పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారు: తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

telangana High Court hot comments on police
  • పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందన్న హైకోర్టు
  • ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వ్యాఖ్య
  • పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు
పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది. పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని చురక అంటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
High Court
TS High Court
TS DGP

More Telugu News