sircilla rajaiah: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

  • ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
  • సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు 
  • రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్న చైర్మన్, సభ్యులు
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. రాజయ్య 15వ లోక్ సభకు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇప్పటికే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.
sircilla rajaiah
Telangana
Congress

More Telugu News