Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్

Bomb threat to Delhi High Court
  • బల్వంత్ దేశాయ్ పేరుతో బెదిరింపులు
  • ఢిల్లీలో జరిగే అతి పెద్ద పేలుడు అంటూ వార్నింగ్
  • హైకోర్టుతో పాటు దిగువ కోర్టులకు కూడా భారీ భద్రత
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బల్వంత్ దేశాయ్ పేరుతో ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీన హైకోర్టులో బాంబు పేలుడు సంభవిస్తుందని మెయిల్ లో హెచ్చరించారు. అంతేకాదు ఢిల్లీలో జరిగే అతి పేలుడు ఇదేనని... వీలైనంత ఎక్కువ భద్రతను పెట్టుకోవాలని కూడా సూచించారు. ఈ బెదిరింపులు సంచలనం రేకెత్తించాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. హైకోర్టు పరిసరాలతో పాటు ఢిల్లీలోని అన్ని దిగువ కోర్టుల్లో భద్రతను భారీగా పెంచారు. భద్రతా తనిఖీలకు సహకరించాల్సిందిగా హైకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు దిగువ కోర్టుల బార్ అసోసియేషన్లు కూడా న్యాయవాదులకు సూచించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

Delhi High Court
Bomb Threat

More Telugu News