KTR: ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం గతంలోనే డిమాండ్ చేశాం: కేటీఆర్

KTR demands for obc welfare ministry
  • ఓబీసీ మంత్రిత్వ శాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించామన్న కేటీఆర్
  • ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి
  • ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయని వెల్లడి
ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఓబీసీ మంత్రిత్వ శాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయన్నారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలన్నారు. ఈ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు.
KTR
BRS
Congress
Telangana

More Telugu News