BJP: బీజేపీలో చేరిన పీఎల్ శ్రీనివాస్, వైసీపీ నేత వెళ్లల రామ్మోహన్

PL Srinivas and Vellala Rammohan join bjp
  • పీఎల్ శ్రీనివాస్‌తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలేఖ్య
  • కమలం కండువా కప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెళ్లల రామ్మోహన్
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. శుక్రవారం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో... పీఎల్ శ్రీనివాస్, ఆయన కూతురు, ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు.  సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట్ర, జాతీయస్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 

బీజేపీలో చేరిన వైసీపీ నేత

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ కూడా కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BJP
G. Kishan Reddy
Telangana

More Telugu News