Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

Youth Congress leaders besieged Minister Ambati Rambabu house
  • 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
  • బైబై జగన్ రెడ్డీ, బైబై వైసీపీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
  • అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు
  • పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట
25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. సత్తెనపల్లిలోని మంత్రి ఇంటికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనకు దిగారు. ఇది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన హామీని జగన్ గాలికి వదిలేశారని విమర్శించారు. ‘బైబై జగన్‌రెడ్డి’, ‘బైబై వైసీపీ’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

వీరి ప్రదర్శనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, నిరసన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
Ambati Rambabu
Youth Congress
Sattenapally
YSRCP

More Telugu News