Medaram Jatara: మేడారం జాతరపై అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

  • మేడారం జాతర పనులను పరిశీలించిన సీతక్క
  • మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని విమర్శ 
  • సమ్మక్క - సారక్కలది ఉద్యమ చరిత్ర... పూజించే తీరులో లోపాలు ఉండకూడదని అదేశాలు
  • భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచన
Minister Seethakka hot comments on Medaram festival

మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మేడారం జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క - సారలమ్మది ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షలమంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు. 

పార్టీ కోసం కష్టపడిన వారిని మరిచిపోం

పార్టీ కోసం.. గెలుపు కోసం కష్టపడిన వారిని తాము మరిచిపోమన్నారు. పెద్దల సభకు యువకులను పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.

More Telugu News