Vasanta Panchami: వసంతపంచమి రోజు త్రిపుర కాలేజీలో సరస్వతీదేవి విగ్రహానికి అవమానం.. ఆచ్ఛాదన లేని విగ్రహానికి పూజలు

  • వసంతపంచమని పురస్కరించుకుని ప్రభుత్వ కాలేజీలో పూజలు
  • విగ్రహంపై ఆచ్ఛాదన లేని విషయాన్ని గుర్తించిన ఏబీవీపీ 
  • ఏబీవీపీ నిరసనలకు బజరంగ్‌దళ్ మద్దతు
  • కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Unhappy over Saraswati attire Bajrang Dal and ABVP put saree on idol in Tripura

వసంత పంచమి పురస్కరించుకుని త్రిపురలోని ఓ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన పూజలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. పూజల్లో ఉపయోగించిన సరస్వతీదేవి విగ్రహానికి ఆచ్ఛాదన లేకపోడమే కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒంటిపై అచ్ఛాదన లేకుండా ఉన్న విగ్రహాన్ని చూసి భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు నిరసనలు చేపట్టారు. వీరికి బజరంగదళ్ కూడా మద్దతుగా నిలవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. 

సరస్వతీదేవి విగ్రహాన్ని అవమానించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. అమ్మవారి విగ్రహంపై వెంటనే చీర కప్పాలని సూచించింది. ఈ విషయంలో త్రిపుర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ గొడవపై స్పందించిన కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. తాము పూజించిన సరస్వతీదేవి విగ్రహం హిందూదేవాలయాల్లోని సంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. చివరికి ఒత్తిడి పెరగడంతో విగ్రహాన్ని మార్చారు.

More Telugu News