Buried Truth: షీనా బోరా మర్డర్ కేసు కథగా 'బరీడ్ ట్రూత్' .. నెట్ ఫ్లిక్స్ లో!

  • షీనా బోరా హత్యకేసు నేపథ్యంలో 'బరీడ్ ట్రూత్'
  • 4 ఎపిసోడ్స్ గా నడిచే డాక్యు మెంటరీ సిరీస్ 
  • ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • దర్శకత్వం వహించిన ఇరా బాహ్ల్ - షానా లెవీ

Buried Truth Series Update

షీనా బోరా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. 2012లో ఆమె హత్యకి గురైంది .. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. షీనా బోరా హత్యకేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా అరెస్టు కావడం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఈ హత్యకేసులోని మలుపులు పోలీస్ డిపార్టుమెంటును సైతం నివ్వెరపోయేలా చేశాయి. 

ఈ హత్య కేసు ముంబైలోని బోరా - ముఖర్జియా కుటుంబీకుల జీవితాలను మార్చేసింది. ఆ సంఘటనలన్నింటినీ కలుపుతూ, 'బరీడ్ ట్రూత్' అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. ఇరా బాహ్ల్ - షానా లెవీ దర్శకత్వం వహించిన ఈ డాక్యు సిరీస్, 4 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేక్ మేక్ - ఇండియా టుడే వారు కలిసి ఈ సిరీస్ ను నిర్మించారు. 

ఈ నెల 23వ తేదీ నుంచి ఈ డాక్యు సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. షీనా బోరా - ఇంద్రాణి ముఖర్జియా కుటుంబాల మధ్య అనుబంధాలు దెబ్బతినడం .. ఎవరి వ్యక్తిగత ఎజండాతో వారు ముందుకు వెళ్లడం .. హత్యకు దారితీసిన పరిస్థితులు ఈ సిరీస్ లో ఆవిష్కరించనున్నారు. కొన్ని ఒరిజినల్ వీడియో క్లిప్స్ కూడా ఈ సిరీస్ లో చోటుచేసుకోనున్నాయి.

More Telugu News